● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
మహబూబాబాద్: పత్తి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీసీఐ కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ చాంబర్‌లో శుక్రవారం పత్తి కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పక్కా ప్రణాళికతో పత్తి కొనుగోలు చేయాలన్నారు. పత్తి క్వింటాకు రూ.8,667 మద్దతు ధర ఉందన్నారు. వ్యవసాయ అఽధికారులు గ్రామస్థాయిలో రైతులను చైతన్యపరిచి కిసాన్ యాప్‌లో నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా మార్కెటింగ్ అధికారి నరేందర్, డీఎస్పీ తిరుపతి రావు, డీఏఓ విజయచంద్ర, డీటీఓ శంకర్ పాల్గొన్నారు.
అవగాహన కల్పించాలి
సమాచార హక్కు చట్టంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం సమాచార హక్కు చట్టం–2005 జిల్లాస్థాయి వారోత్సవాలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 5నుంచి 12వరకు జిలా,్ల రెవెన్యూ డివిజన్, మండలస్థాయిలో వారోత్సవాలు నిర్వహించి సమాచారం హక్కు చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. డీఆర్వో నాగలక్ష్మి సంబంధిత అఽధికారులు పాల్గొన్నారు.


