‘టీడబ్ల్యూయూ’ ఆధిక్యం | - | Sakshi
Sakshi News home page

‘టీడబ్ల్యూయూ’ ఆధిక్యం

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

నెహ్రూసెంటర్‌: జిల్లాలో శుక్రవారం ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మానుకోట డిపో ఆవరణలో ఉదయం 5నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ జరిగింది. డిపో పరిధిలో 218 ఓట్లకు గానూ 216 ఓట్లు పోలయ్యా యి. అనంతరం ఓట్లు లెక్కించగా టీడబ్ల్యూయూ కూటమి ఆధిక్యం సాధించింది. కాగా, ఈ నెల 17న ఎవరూ గెలిచారనేది అధికారికంగా వెల్లడికానుంది.

ఎంప్లాయీస్‌ యూనియన్‌ అభ్యంతరం..

ఎన్నికల్లో భాగంగా టీడబ్ల్యూయూ కూటమి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ కూటమి, కార్మిక సంఘాల నాయకుడు బి.అజయ్‌సారథిరెడ్డి, నాయకులు అభ్యంతరం తెలిపి నిరసనకు దిగారు. మహబూబాబాద్‌ పట్టణ సీఐ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.

తొర్రూరు డిపోలో..

తొర్రూరు: తొర్రూరు ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 302 ఓట్లకు గానూ 300 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎంప్లాయీస్‌ యూనియన్‌ కూటమిపై టీడబ్ల్యూయూ కూటమి ఆధిక్యం సాధించింది. టీడబ్ల్యూయూ 150 ఓట్లు సాధించగా, ఈయూ 148 ఓట్లకు పరిమితమైంది. ఒక ఓటు బహుజన వర్కర్స్‌ యూనియన్‌కు పోలవ్వగా మరో ఓటు చెల్లుబాటు కాలేదు. టీడబ్ల్యూయూ నాయకులు డిపోలో సంబురాలు జరుపుకున్నారు.

హోరాహరీగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు

మానుకోట డిపోలో 218 ఓట్లకు 216 ఓట్లు పోల్‌

తొర్రూరులో 302 ఓట్లకు గానూ 300 ఓట్లు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement