ఓల్టేజీ ప్రమాణాలు సక్రమంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఓల్టేజీ ప్రమాణాలు సక్రమంగా నిర్వహించాలి

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

కురవి/నెహ్రూసెంటర్‌: విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తూ.. 33 కేవీ స్థాయిలో ఓల్టేజీని నిర్ధేశిత ప్రమాణాల మేరకు సక్రమంగా నిర్వహించాలని, పీటీఆర్‌ ట్యాప్‌ పొజీషన్లను పరిశీలిస్తూ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సరఫరా అందించాలని విద్యుత్‌శాఖ డైరెక్టర్‌ టి.మధుసూదన్‌ సూచించారు. జిల్లాలోని అయ్యగారిపల్లి, గూడూరు, మునిగలవీడు, నర్సింహులగూడెం సబ్‌స్టేషన్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్‌స్టేషన్‌లోని ప్రస్తుత లోడ్‌ పరిస్ధితులు, పీటీఆర్‌ ట్యాప్‌ పొజీషన్లు, 33 కేవీ లోడ్‌, ఓల్టేజీ స్థాయి, పవర్‌ ఫ్యాక్టరీ అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆయన వెంట ఎస్‌ఈ దర్శన్‌కుమార్‌, డీఈలు హీరాలాల్‌, కోటేశ్వర్‌రావు, తిరుపతి, ఏడీఈ సంగీత, రమేశ్‌, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement