ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

● అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌

మహబూబాబాద్‌: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ కె.అనిల్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి, సంబంధిత అధికారులను సమగ్రశిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. సన్నరకానికి మద్దతు ధర క్వింటాకు రూ.2,461 కామన్‌ రకానికి రూ 2,441 మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు. 7 రకాల ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ కె.అనిల్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వాహణపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు, తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ డీఈఓ మందుల శ్రీరాములు అధికారులు పాల్గొన్నారు.

అర్హులను గుర్తించాలి..

డోర్నకల్‌: మండలంలోని వెన్నారంలో నిరుపయోగంగా ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం అర్హులను గుర్తించాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) పురుషోత్తం ఆదేశించారు. వెన్నారంలో గురువారం పర్యటించిన ఆయన వీబీజీ రాంజీ పనులు, ఇందిరమ్మ పథకానికి అర్హుల ఎంపిక, మొదటి విడత నిర్మాణ పనులు, నిరుపయోగంగా ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై సమీక్షించారు. ఎంపీడీఓ ఆంజనేయులు, సర్పంచ్‌ జక్కుల కౌసల్య, ఉపసర్పంచ్‌ మల్లయ్య, ఏపీఓ పార్థసారధి, ఈసీ రఘు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement