నామినేషన్ల ఉపసంహరణ పూర్తి
● అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
● పలుచోట్ల పార్టీలకు రెబల్స్ బెడద
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులకు 357 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా పరిశీలనలో 127 తిరస్కరణకు గురి కాగా 230 నామినేషన్లు ఉన్నాయని కమిషనర్ రాజేశ్వర్ తెలిపారు. కాగా మంగళవారం 75 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపంసహరించుకోగా బరిలో 155 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల బరిలో 63మంది అభ్యర్థులు
మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులకు దాఖలైన నామినేషన్ల నుంచి మంగళవారం ఉపసంహరణ అనంతరం 63 మంది బరిలో నిలిచారని మున్సిపల్ కమిషనర్ విజయానంద్ తెలిపారు. 103 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. కాంగ్రెస్ 15, బీఆర్‌ఎస్ 15, బీజేపీ 15, సీపీఎం నలుగురు బరిలో ఉన్నారని తెలిపారు. కాగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి అవకాశం రాని 14 మంది అభ్యర్థులు రెబల్‌గా బరిలో నిలవడం గమనార్హం.
డోర్నకల్‌లో 64 మంది..
డోర్నకల్: మున్సిపాలిటీ ఎన్నికల బరిలో 64 మంది నిలిచారు. వివిధ పార్టీల నుంచి 102 మంది నామినేషన్లు దాఖలు చేయగా చివరి రోజు 38 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 15 వార్డుల నుంచి 64 మంది పోటీలో ఉన్నట్లు మంగళవారం అధికారులు ప్రకటించారు. ఒకటో వార్డు నుంచి ఆరుగురు, 2వ వార్డు నుంచి ఐదుగురు, 3వ వార్డు నుంచి ఆరుగురు, 4వ వార్డు నుంచి ఐదుగురు, 5వ వార్డు నుంచి ముగ్గురు, 6వ వార్డు నుంచి ఆరుగురు, 7వ వార్డు నుంచి నలుగురు, 8వ వార్డు నుంచి నలుగురు, 9వ వార్డు నుంచి ముగ్గురు, 10వ వార్డు నుంచి ఐదుగురు, 11వ వార్డు నుంచి ముగ్గురు, 12వ వార్డు నుంచి నలుగురు, 13వ వార్డు నుంచి ఐదుగురు, 14వ వార్డు నుంచి ఇద్దరు, 15వ వార్డు నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు.
తొర్రూరులో..
తొర్రూరు: నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు 63 మంది అభ్యర్థుళు బరిలో ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ తెలిపారు. మొత్తం 103 మంది నామినేషన్లు దాఖలు చేయగా వారిలో 40 మంది ఉపసంహరించుకున్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఉపసంహరణ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.
కేసముద్రంలో 58 మంది..
కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీలో 167 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం నలుగురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. మంగళవారం పరిశీలన అనంతరం 121 నామినేషన్లు ఉండగా 63 మంది ఉపసంహరించుకున్నారు. దీంతో 58 మంది బరిలో ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రకటించారు.


