తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి

Feb 4 2026 7:31 AM | Updated on Feb 4 2026 7:31 AM

తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి

తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి

డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్‌

నెల్లికుదురు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచి తల్లీబిడ్డల ఆరోగ్యాలను పరిరక్షించాలని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్‌ వైద్యులు, సిబ్బందికి సూచించారు. స్థానిక పీహెచ్‌సీలో మంగళవారం నిర్వహించిన ఆశా ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల పరిధిలో 12 వారాల లోపు గర్భిణుల వివరాల నమోదు తప్పనిసరిగా చేపట్టాలని తెలిపారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ సిజేరియన్‌ ఆపరేషన్ల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ వారం ప్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి సంక్రమిత వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యులు రమ్య, చైతన్య, సిబ్బంది పాల్గొన్నారు.

గర్భిణుల వివరాలు నమోదు చేయాలి

బయ్యారం: జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల పరిధిలో గర్భిణుల వివరాలు నమోదు చేయాలని జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ సారంగం అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో మంగళవారం నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీహెచ్‌సీల పరిధిలోని సబ్‌సెంటర్ల వారీగా గుర్తించిన గర్భిణులకు మొదటి, రెండు పరీక్షలను పీహెచ్‌సీ వైద్యులు నిర్వహించి మూడు, నాలుగు పరీక్షలను జిల్లా జనరల్‌ ఆస్పత్రిలోని సీ్త్ర వైద్య నిపుణులతో చేయించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. గర్భిణులకు 102 వాహన సేవలపై వివరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, వైద్యులు లక్ష్మినారాయణ, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement