బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

Feb 4 2026 7:31 AM | Updated on Feb 4 2026 7:31 AM

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌

జాతర వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

కురవి: మహాశివరాత్రి నుంచి 16 రోజులపాటు జరి గే కురవిలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌ అన్నారు. వీరభద్రస్వామి ఆలయ ఆవరణలో ఆలయ చైర్మన్‌ కొర్ను రవీందర్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జాతరపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్కడకు వచ్చి న రాంచంద్రునాయక్‌కు ఆలయ ఈఓ సత్యనారా యణ, వేదపండితులు స్వాగతం పలికారు. ఈసందర్భంగా జాతర వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్ల ప్రతిపాదనలు సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డికి అందజేసినట్లు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండా సురేఖ– దంపతులను ఆహ్వానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, ధర్మకర్తల మండలి సభ్యులు బాలగాని శ్రీనివాస్‌, చిన్నం గణేష్‌, శక్రునాయక్‌, గడీల భిక్షపతి, శ్రీని వాస్‌, సంజీవరెడ్డి, సర్పంచ్‌ బాదావత్‌ లక్ష్మీరాజు నాయక్‌, తహసీల్దార్‌ విజయ, ఎంపీడీఓ వీరబాబు, సొసైటీ చైర్మన్‌ గార్లపాటి వెంకటరెడ్డి, నాయకులు అంబటి వీరభద్రం, రాజేందర్‌కుమార్‌, అవిరె మోహన్‌రావు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement