కొత్త భవనంలోకి రైల్వే కార్యాలయాలు | - | Sakshi
Sakshi News home page

కొత్త భవనంలోకి రైల్వే కార్యాలయాలు

Feb 4 2026 7:31 AM | Updated on Feb 4 2026 7:31 AM

కొత్త భవనంలోకి  రైల్వే కార్యాలయాలు

కొత్త భవనంలోకి రైల్వే కార్యాలయాలు

రెండో నంబర్‌ ప్లాట్‌ఫారంపై

భవనాల కూల్చివేత

డోర్నకల్‌: డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌లో ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారంపై నిర్మించిన కొత్త భవనంలోకి ఆయా శాఖల కార్యాలయాలను తరలిస్తున్నా రు. దశాబ్దాల కాలంగా రైల్వే జంక్షన్‌ పరిధి లోని వివిధ కార్యాలయాలు రెండో నంబర్‌ ప్లాట్‌ఫారంపై ఉన్న భవనంలో కొనసాగుతున్నాయి. కొంతకాలం క్రితం ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారంపై రెండంతస్తుల భారీ భవన నిర్మాణ పనులు చేపట్టగా ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయి. ఇటీవల రెండో నంబర్‌ ప్లాట్‌ఫారం భవనంలో నిర్వహిస్తున్న వివిధ శాఖల కోసం కొత్త భవనంలో గదులు కేటాయించా రు. దీంతో ఒక్కొక్కటిగా కార్యాలయాలు కొత్త భవనంలోకి మారుస్తున్నారు. ఆర్పీఎఫ్‌, ఆర్పీ ఎఫ్‌ ప్టోర్‌రూం, ఎస్‌ఎంఆర్‌, ఎస్‌ఎంఆర్‌ స్టోర్‌ రూం, ఎలక్ట్రికల్‌, స్టేషన్‌ మేనేజర్‌ రూం, జీఆ ర్‌పీ, సీబీఎస్‌ఆర్‌ రూం, సీసీసీ, ఆర్‌పీఎఫ్‌ ఉమె న్‌ డ్రస్సింగ్‌ రూం, సెమినార్‌, క్రూ లాబీ, సీటీ ఐ రూంల కోసం భవనంలో గదులు కేటాయించగా ఇప్పటికే కొత్త గదుల్లోకి పరిపాలన, ఆపరేటింగ్‌ను మార్చారు. మరోవైపు రెండో నంబర్‌ ప్లాట్‌ఫారంలో పాత భవనాల కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. నూతన భవనంలోకి మారడంపై రైల్వే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండో నంబర్‌ ప్లాట్‌ ఫారంపై ఉన్న కార్యాలయానికి ఎఫ్‌ఓబీ మీదుగా వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement