గంజాయి రవాణా కేసులో ముగ్గురికి పదేళ్ల జైలు
జనగామ రూరల్: గంజాయి రవాణా కేసులో నేరం రుజువు కావడంతో ముగ్గురు వ్యక్తులకు 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ మంగళవారం తీర్పు వెలువరించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గుబ్బడి తండాకు చెందిన గుగులోత్ సుధాకర్, హైదరాబాద్ జుమ్మేరాత్ బజారుకు చెందిన దినేశ్, వర్ధన్నపేట ఇల్లందకు చెందిన గుగులోత్ సురేశ్ 2021, జూలై 2వ తేదీన కారులో ఎండు గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు జనగామలోని పట్టుపురుగుల పరిశ్రమ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయడానికి యత్నిస్తుండగా ముగ్గురు పారిపోతుండగా వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 126 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం అప్పటి ఎస్సై సి.హెచ్ రవికుమార్ ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ బాలాజీ వరప్రసాద్ కేసు దర్యాప్తు జరిపి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత సీఐ సత్యనారాయణ రెడ్డి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ న్యాయవాది కాచరాజు హరిశ్చంద్రప్రసాద్ వాదించగా కేసు పూర్వపరాలను పరిశీలించిన జిల్లా జడ్జి.. నిందితులకు పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు.
గంజాయి రవాణా కేసులో ముగ్గురికి పదేళ్ల జైలు


