8న గణపురానికి సీఎం రేవంత్
గణపురం : ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీన గణపురం రానున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గణపురం మండలం చెల్పూరు జీపీ పరిధిలోని రామప్ప కాలనీ ఎదుట ఉన్న స్థలంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీఎం సభాస్థలి, వీఐపీ గ్యాలరీ, పార్కింగ్, రహదారి తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సజావుగా సాగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఆర్డీఓ హరికృష్ణ, ఆర్‌అండ్‌బీ ఈఈ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొడవటంచలో..
రేగొండ: మండలంలోని కొడవటంచకు ఈ నెల 8న సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో సభ నిర్వహణ, హెలిప్యాడ్ స్థలాన్ని ఎస్పీ సంకీర్త్ మంగళవారం పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్


