అగ్నికణం చాకలి ఐలమ్మ
శాయంపేట : అగ్నికణం చాకలి ఐలమ్మ అని అరుణోదయ సాంస్కృతిక మండలి కళాకారిణి విమలక్క అన్నారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని కొప్పుల గ్రామంలో ఐలమ్మ విగ్రహాన్ని ఆవి ష్కరించారు. అనంతరం ఐలమ్మ విగ్రహ దాత వైనాల రాజేందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో విమలక్క మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిలూదారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం సాగిన పోరులో విప్లవం రగిలించిన అగ్ని కణం చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. ఐలమ్మ జీవితం మహిళా లోకానికి మార్గదర్శకం, స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అరుణోదయ సాంస్కృతిక మండలి కళాకారిణి విమలక్క


