రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు షురూ
డోర్నకల్: స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆదివారం 69వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు భారీగా హాజరుకాగా.. పోటీలు ఎస్సై గడ్డం ఉమ ప్రారంభించారు. పలు కేటగిరీల్లో పోటీలు హోరాహోరీగా సాగాయి. కార్యక్రమంలో వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండలోజు సుధాకర్, కొత్త వీరన్న, రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు మండలోజు రామారాజు, అబ్బయ్య, విమల, ఎస్సై ఖాదర్‌పాషా, పీఈటీలు రవికుమార్, విజయ్‌చందర్, తలారి విద్యాసాగర్, నాయకులు సుమేర్‌చంద్‌జైన్, మాదా శ్రీనివాస్, కేశబోయిన కోటిలింగం పాల్గొన్నారు.


