రైల్వే టెక్నీషియన్లు తయారు చేసిన కళాకృతులు..
రైల్వే టెక్నీషీయన్లు బయట పడేసే బోల్టులు, నట్లు, వాచర్స్, స్ప్రింగ్‌లు, చిన్న చక్రాలు, రింగ్‌లు, చైన్, రేకు, ఇతరత్రా ఇనుప వస్తువులతో ఈఫిల్ టవర్, రోబో, రాకెట్, గిటార్, వెయిట్ లిఫ్టర్, బుల్లెట్ వాహనం, ఇస్రో, హెలికాప్టర్, నెమలి, గుడ్లగూబ పక్షి, తాబేలు, కుక్క, ప్లవర్ వాజ్‌లు తయారు చేశారు. డీజిల్‌షెడ్‌లో వివిధ సెక్షన్లలో విధి నిర్వహణలో భాగంగా టెక్నీషియన్లు తయారు చేసిన వాటిని షెడ్ వద్ద ప్రత్యేక స్థలంలో ఏర్పాటు చేసినట్లు రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ చైర్మన్ ఎస్.కె.జానీమియా, సెక్రటరీ పాక వేదప్రకాశ్ తెలిపారు.


