క్రీడల సక్సెస్‌లో పీఈటీలే కీలకం
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడాపోటీల నిర్వహణ సక్సెస్ కావాలంటే వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం నిర్వహిస్తున్న అండర్–17 బాలబాలికల రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్, జూడో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు క్రీడలు చాలా అవసరమని పేర్కొన్నారు. హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటాలని అన్నారు. ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వి.ప్రశాంత్ మాట్లాడుతూ.. మూడ్రోజుల పాటు అండర్–14,17,19 బాలబాలికల విభాగంలో జిమ్నాస్టిక్స్ పోటీలు, అండర్–17 బాలబాలికల విభాగంలో జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.పార్థసారథి, ఎ.ప్రభాకర్‌రెడ్డి, డి.కుమార్, సీహెచ్ పెద్దిరాజు, సురేష్‌బాబు, వి.రాణి, ఎస్.శ్రీలత, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సుభాష్, రవీంద్రప్రసాద్, సురేష్, దేవేందర్, కిషన్, సుమలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
3, 4 తేదీల్లో ఎస్‌జీఎఫ్ క్రీడలు
హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో ఈ నెల 3, 4 తేదీల్లో అండర్–19 బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీన క్రికెట్, నెట్‌బాల్, సాఫ్ట్‌బాల్, లాన్‌టెన్నీస్, క్యారం, సెపక్‌తక్రా, స్కాష్, స్కేటింగ్, 4వ తేదీన ఖోఖో ఎంపికలు ఉంటాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు ఉదయం 9గంటలకు జేఎన్ స్టేడియం వద్ద హాజరుకావాలని పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి


