కంపెనీ పనులు త్వరగా పూర్తి చేయాలి
గీసుకొండ : యంగ్‌వన్ కంపెనీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ఉత్పత్తిని పెంచాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని దక్షిణ కొరియా యంగ్‌వన్ కార్పొరేషన్ చైర్మన్, సీఈఓ కిహాక్‌సంగ్ పేర్కొన్నారు. శనివారం గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ)లో దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌వన్ ఎవర్‌టాప్ టెక్స్‌టైల్ అండ్ అపెరల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పనులను ఆ ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. కంపెనీలో టీషర్టులు, ట్రాక్‌సూట్లు, జర్కిన్లు, క్రీడా దుస్తులు, బూట్లు తదితర వస్తువులు తయారు చేయడానికి ఆరు షెడ్లను నిర్మిస్తున్నారని చెప్పారు. యూనిట్–1లో చేపట్టిన ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ఆయన మధ్యాహ్నం 12:30 గంటలు తిరుగు పయనమయ్యారు. కంపెనీ వైస్ చైర్మన్ మిన్‌షుక్, డైరెక్టర్లు షాహజాన్, సుభ్యసాచి చౌదరి, దిలీప్, ఇండియా హెడ్, డైరెక్టర్ శ్రీకాంత్ ఎస్ భూమిడిపాటి, ఫైనాన్స్ హెడ్ ఆశిష్ అగర్వాల్, హెచ్‌ఆర్ సురేశ్, అడ్మిన్ మేనేజర్ కృష్ణమూర్తి, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్, మొగసాని సంపత్ తదితరులు ఉన్నారు.
ఉత్పత్తి పెంచి,
ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
యంగ్‌వన్ కార్పొరేషన్ చైర్మన్
కిహాక్ సంగ్


