బడికి పోతే బతికేటోడివి బిడ్డో..
సంగెం : మరో రెండ్రోజుల్లో హాస్టల్‌కు వెళ్తాడనుకుంటే అంతలోనే తుపాన్‌తో నానిన గోడ కూలి బాలుడు మృత్యువాత పడిన విషాద ఘటన సంగెం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీ సుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన వేల్పుల మౌ నిక, సాంబరాజు దంపతులకు కూతురు దివ్యశ్రీ, కుమారుడు నవదీప్ (10)లు సంతానం. పేద కు టుంబానికి చెందిన సాంబరాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నవదీప్ కొ మ్మాలలోని ఏలోహీమ్ ప్రైవేట్ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. ఇటీవల జనగామలోని తె లంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నవదీప్‌కు సీటు వచ్చింది. సోమవారం గురుకుల హాస్టల్‌కు పంపిస్తామని స్కూల్‌కు పంపించకుండా వారం రోజులుగా ఇంటి వద్దనే ఉండనిచ్చారు. శని వారం నవదీప్ ఇంటి సమీపంలోని దుకాణానికి తినుబండరాలు కొనుక్కొనేందుకు ఒక్కడే వెళ్తున్నాడు. అయితే ఇటీవల వర్షాలు, తుపాన్ కారణంగా నాని బలహీనపడిన బన్న రమేశ్‌కు చెందిన బా త్రూం గోడ ఒక్కసారిగా కూలి నవదీప్ భుజాలు, తలపై పడింది. దీంతో నవదీప్ తల పగిలి చెవులు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. హుటాహుటిన ఎంజీఎంకు తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు మృతిచెందినట్లు తెలిపారు. కాగా బడికి వెళ్తే బతికేవాడివి కొడుకా అంటూ నవదీప్ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరుల గుండెలను పిండేశాయి. బాలుడి తాత లచ్చయ్య ఫిర్యాదు మేర కు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు.
● బాత్రూం గోడ కూలి బాలుడి మృతి
● చింతలపల్లిలో విషాద ఘటన


