యువత పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
మహబూబాబాద్ అర్బన్ : యువత సర్దార్ వల్ల భాయ్ పటేల్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా 2కే రన్ నిర్వహించారు. విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొనగా.. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శప్రాయుడని, ఐకమత్యంతో ఏదైనా సాధ్యం అవుతుందని నిరూపించారన్నారు. అనంతరం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభా య్ పటేల్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, మెరుగైన సమాజం కోసం ఆయన చూపిన మార్గాన్ని అ నుసరించాలన్నారు. కాగా మానుకోట టౌన్ పోలీ స్‌స్టేషన్ నుంచి ప్రారంభమైన రన్ ఎన్టీఆర్ స్టేడి యం వద్ద ముగిసింది. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎస్పీలు తిరుపతిరావు, శ్రీనివాసరావు, విజయప్రతాప్, మో హన్, సీఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య ఉన్నారు.


