రైతుల సంక్షేమమే లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: రైతులు పండించిన పత్తి పంటను తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సూచించారు. మహబూబాబాద్ మున్సి పాలిటీ పరిధి బేతోలు గ్రామ శివారు సాయి శ్రీనివాస కాటన్ ఇండస్ట్రీస్ వద్ద సీసీఐ పత్తి కొనుగొళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలను అర్థం చేసుకుని, సరైన మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతులకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందన్నారు. ఏఎ ంసీ చైర్మన్ సుధాకర్, డైరెక్టర్లు వెంకన్న, మల్ల య్య, డీఎంఓ వెంకటేశ్వర్లు, ఏఎంసీ కార్యదర్శి సుజన్ బాబు, వీరభద్రం, లక్ష్మీనారాయణ, రామరాజు, నరసింహారావు, గిరిధర్ గుప్తా, శ్రీనివాస్, యా కన్న, పాషా, దిలీప్ పాల్గొన్నారు.
కేసముద్రంలో..
కేసముద్రం: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే మురళీనాయక్ అ న్నారు. శుక్రవారం కేసముద్రం మార్కెట్‌లో సీసీ ఐ కొనుగోళ్లను ప్రారంభించి మాట్లాడారు. అనంతరం మార్కెట్‌లో ధాన్యం ఆరబోత యంత్రాన్ని ప్రారంభించారు. ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభా య్‌పటేల్ జయంతి సందర్భంగా చిత్రపటా లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అర్పనపల్లి గ్రామంలో వరద బాధితులకు ఐదు క్వింటాళ్ల బియ్యం అందజేశారు. మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి, నాగేశ్వర్‌రావు,అమరలింగేశ్వరరావు ఉన్నారు.
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
● పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం


