శివనగర్‌లో యువకుడు..
ఖిలా వరంగల్/గీసుకొండ: ఓ యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జి ల్లా గీసుగొండ మండలం మచ్చాపూర్ మనుగొండ గట్టుకింది పల్లెకు చెందిన పులి అనిల్ (35) తన భార్య మమతతో కలిసి బుధవారం బైక్‌పై రైల్వేగేట్ ప్రాంతంలో జరిగిన బంధువు అంత్యక్రియలకు హాజరయ్యాడు. వర్షం భారీగా కురుస్తుండడంతో భార్యను బస్సులో పంపించి బైక్ ఇంటికి బయలుదేడు. ఈక్రమంలో శివనగర్ మైసయ్యనగర్ వద్ద జాతీయ ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న భారీ వరదలో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. రాత్రి అ యినా భర్త ఇంటికి రాకపోవడంతో భార్య మమత ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. ఆందోళన చెందిన మమత వెంటనే వరంగల్ శివనగర్‌లోని మైసయ్యనగర్‌కు చేరుకుంది. అప్పటికి వరద ప్రవహం తగ్గడంతో డ్రైనేజీ లో బైక్ లభించింది. కా నీ అనిల్ ఆచూకీ లభించలేదు. దీంతో కార్పొరేటర్లు దిడ్డికుమారస్వామి, సోమిశెట్టి ప్రవీణ్ ఆ ధ్వర్యంలో గాలింపు చ ర్యలు చేపట్టగా 35వ డివిజన్ నేతాజీ స్కూల్ స మీపం డ్రెయినేజీలో అనిల్ మృతదేహం లభించింది. దీంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ రమేశ్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ గురువారం తెలిపారు.


