శ్రమించిన పోలీస్
● ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీపీ
● సురక్షిత ప్రాంతాలకు వరద బాధితులు
వరంగల్ క్రైం: మోంథా తుపాను సృష్టించిన విధ్వంసానికి గ్రేటర్ పరిధి ట్రైసీటీలోని పలు కాలనీలు అతలాకుతలం అయ్యాయి. వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి పోలీసులు అందిస్తున్న సేవలతో పాటు ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు. హనుమకొండ పోలీసులు రాయపుర ప్రాంతంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు బాధితులకు టిఫిన్లు, వాటర్ బాటిళ్లు అందించారు. ములుగు రోడ్డులోని గాయత్రి కళాశాలలో చిక్కుకుపోయిన విద్యార్థినులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనారోగ్యంతో ఉన్న ఓ వృద్ధుడిని స్ట్రెచర్ మీద తీసుకొచ్చి 108లో ఎంజీఎంకు తరలించారు.


