వాగులో దంపతుల గల్లంతు..
ఎల్కతుర్తి: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగు దాటుతుండగా దంపతులు బుధవారం రాత్రి గల్లంతయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన ప్రణయ్, కల్పన దంపతులు బైక్‌పై అత్తగారి ఇల్లు అక్కన్నపేటకు వెళ్తున్నారు. మల్లారం దగ్గర రోడ్డు దెబ్బతినడంతో మోత్కులపల్లి వైపునకు వెళ్తున్నారు. ఇక్కడ వాగు దాటే ప్రయత్నంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. గురువారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు చెరువు దగ్గర బైక్ కనిపించడంతో నంబర్ ద్వారా దంపతులను గుర్తించారు. రెస్క్యూ సిబ్బంది వాగు, చెరువు పరిసరాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
వాగులో దంపతుల గల్లంతు..


