డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు పెంపు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు బీఏ, బీకాం, బీబీఏ,బీఎస్సీ , బీ ఓకేషనల్, బీసీఏ, బీహెచ్‌ఎం అండ్ సిటీ కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు నవంబర్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రూ. 50 అపరాధ రుసుముతో నవంబర్ 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి వెంకటయ్య గురువారం తెలిపారు. రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29వరకు గడువు ముగియగా మళ్లీ ఆ గడువు పొడిగించారు.
‘ఓపెన్’ ఫలితాలు విడుదల
విద్యారణ్యపురి: ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ డైరెక్టర్ గురువారం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాల వారీగా ఫలితాలు ఇలా..
● హనుమకొండ జిల్లాలో టెన్త్‌లో 70 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 54మంది ఉత్తీర్ణత( 77.14శాతం), ఇంటర్‌లో 226మందికి 144మంది ఉత్తీర్ణత (63.72శాతం) సాఽధించారు.
● వరంగల్ జిల్లాలో టెన్త్‌లో 263 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 82 మంది (3 1.18శాతం), ఇంటర్‌లో 232 మందికి 107 మంది ఉత్తీర్ణత (46.12శాతం)సాధించారు.
● మహబూబాబాద్ జిల్లాలో టెన్త్‌లో 95మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 75మంది ఉత్తీర్ణత (78.95శాతం), ఇంటర్‌లో 98మందికి 70 మంది ఉత్తీర్ణత (71.43శాతం) సాధించారు.
● జనగామ జిల్లాలో టెన్త్‌లో 59మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 48మంది (81.36శాతం), ఇంటర్‌లో 96మందికి 57మంది ఉత్తీర్ణత (59.38శాతం) సాఽధించారు.
● ములుగు జిల్లాలో టెన్త్‌లో 120మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 105మంది (87.50శాతం ఉత్తీర్ణత), ఇంటర్‌లో 287మందికి 201మంది ఉత్తీర్ణత (70.03శాతం) సాధించారు.
● జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోటెన్త్‌లో 60 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 39మంది ఉత్తీర్ణత (65శాతం) సాధించారు. ఇంటర్‌లో 76మంది విద్యార్థులకు 54 మంది ఉత్తీర్ణత 71.05శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈఫలితాలను తెలంగాణ ఓపెన్ స్కూల్.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు నవంబర్ 4నుంచి 12 తేదీవరకు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు పెంపు


