7 గంటలపాటు రైళ్ల నిలిపివేత
కాజీపేట రూరల్ : హసన్‌పర్తి–వరంగల్ మధ్య రెండు రైల్వే లైన్లలో గురువారం ఏడు గంటలపాటు రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వడ్డేపల్లి బ్రిడ్జి వద్ద ట్రాక్‌ను వరద ముంచెత్తడంతో ముప్పు పొంచి ఉందనే సమాచారం గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు రైల్వే అధికారులకు వచ్చింది. దీంతో బ్రిడ్జి ట్రాక్ వద్ద డేంజర్ లెవెల్ క్రాసింగ్ జోన్‌గా ప్రకటించి ఉదయం 6:45 నుంచి మధ్యాహ్నం 1:15 గంటల వరకు రైళ్ల రాకపోలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జి వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో గూడ్స్ రైలును పంపించి ట్రాక్‌ను సరిచేసి సర్వీస్‌లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దీంతో వయా వరంగల్ మీదుగా విజయవాడ వెళ్లే న్యూఢిల్లీ రైళ్లు అప్‌అండ్‌డౌన్‌లో రెండు లైన్లలో యథావిధిగా ప్రయాణిస్తున్నాయని అధికారులు తెలిపారు.
డోర్నకల్ రైల్వే లైన్ క్లియర్‌తో..
డోర్నకల్ జంక్షన్‌లో ట్రాక్ సమస్య బుధవారం రా త్రి వరకు క్లియర్ కావడంతో కాజీపేట, వరంగల్ మీదుగా న్యూఢిల్లీ–విజయవాడ, హైదరాబాద్ మా ర్గాల్లో ప్రయాణించే రైళ్లు నిర్ణీత సమయం కన్నా ఆ లస్యంతో యథావిధిగా నడుస్తున్నాయని కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. దారి మళ్లించిన, రద్దు చేసిన రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని వారు పే ర్కొన్నారు. కాగా, వర్షానికి జలమయమైన రైల్వే డీజిల్‌కాలనీని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) గోపాలకృష్ణణ్ పరిశీలించారు.
కోచ్‌ఫ్యాక్టరీ యూనిట్‌లోకి వరదనీరు..
కాజీపేట శివారులో నిర్మిస్తున్న కాజీపేట రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్‌లోకి వరద నీరు చేరుకుంది. బుధవారం కురిసిన భారీ వర్షానికి వరద భారీగా చేరడంతో రైల్వే యూనిట్‌లో సికింద్రాబాద్ వైపు గల 300 అడుగుల పొడవు వరకు ప్రహరీ నే లమట్టమై కొట్టుకుపోయినట్లు రైల్వే అధికారులు గు రువారం తెలిపారు. అలాగే, వివిధ నిర్మాణాల్లోకి వ రద చేరడంతో మోటార్ల ద్వారా బయటకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వడ్డేపల్లి బ్రిడ్జి వద్ద ట్రాక్‌ను
తాకిన వరద నీరు
7 గంటలపాటు రైళ్ల నిలిపివేత


