ఉత్సాహంగా ఉత్కర్ష్..
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న ఉత్కర్ష్ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం సాంస్కృతిక కార్యక్రమాలతో వైద్య విద్యార్థులు హోరెత్తించారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు, క్లాసికల్ డ్యాన్స్‌లు, నాటికలతో ఆకట్టుకున్నారు. అనంతరం క్రీడలు, సోషల్ మీడియా పోటీల్లో విజేతలు, రన్నరప్‌లకు బహుమతులు అందించారు. కాగా, ఈఎన్‌టీ స్పెషలిస్టు, కేఎంసీ మాజీ ప్రిన్సిపాల్ రమేశ్ తన నృత్య ప్రదర్శనతో విద్యార్థుల్లో ఉత్తేజం నింపారు. ఈ కార్యక్రమానికి డీఎంఈ నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకాగా విశిష్ట అతిథులుగా ఉస్మానియా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగాధిపతి మధుసూదన్, హనుమంతరావు, ప్రముఖ వైద్య నిపుణుడు నర్సింహారెడ్డి, డెర్మటాలజీ విభాగాధిపతి మధుబాబు, ప్రొఫెసర్లు కాత్యాయినీ, పుల్లయ్య, రాంకుమార్‌రెడ్డి, కూరపాటి రమేశ్ పాల్గొన్నారు.
కేఎంసీలో సాంస్కృతిక కార్యక్రమాలు


