టీజీ ఎన్పీడీసీఎల్‌కు తీరని నష్టం.. | - | Sakshi
Sakshi News home page

టీజీ ఎన్పీడీసీఎల్‌కు తీరని నష్టం..

Oct 31 2025 8:02 AM | Updated on Oct 31 2025 8:02 AM

 టీజీ ఎన్పీడీసీఎల్‌కు తీరని నష్టం..

టీజీ ఎన్పీడీసీఎల్‌కు తీరని నష్టం..

హన్మకొండ: మోంథా తుపానుతో టీజీ ఎన్పీడీసీఎల్‌కు తీరని నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి చెట్లు కూలడంతోపాటు కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్‌ లైన్లు దెబ్బతిన్నాయి. వరద ఉ ధృతికి సబ్‌స్టేషన్లు , డిస్ట్రిబ్యూషన్‌ ట్రా న్స్‌ఫార్మర్లులు నీటమునిగాయి. సంస్థ పరిధిలో 428 స్తంభాలు దెబ్బతినగా 88 స్తంభాలను పునరుద్ధరించారు. 218 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బ తినగా 78 పునరుద్ధరించారు. 8 సబ్‌స్టేషన్‌ల్లో వరద నీరు చేరింది. 172 గ్రామాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 342 స్తంభాలు దెబ్బతినగా 75 పునరుద్ధరించారు. 205 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా 68 పునరుద్ధరించారు. 8 సబ్‌స్టేషన్లు నీట మునిగాయి. 162 గ్రామాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వివరాలు

సర్కిల్‌ దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగిన

స్తంభాలు సబ్‌స్టేషన్లు

హనుమకొండ 164 100 2

వరంగల్‌ 76 86 5

జనగామ 16 01 ––

మహబూబాబాద్‌ 71 18 1

జేఎస్‌ భూపాలపల్లి 15 –– ––

దెబ్బతిన్న విద్యుత్‌ లైన్లు

నీటమునిగిన సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement