జాతరలో నాణ్యమైన విద్యుత్ అందించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతరలో నాణ్యమైన విద్యుత్ అందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. బుధవారం మేడారంలో విద్యుత్ పనులపై ములుగు, ఏటూరునాగారం డివిజన్ పరిధిలోని ఇంజనీర్లు, అసిస్టెంట్లు ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మహాజాతరలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలని ఆదేశించారు. జాతరలో విద్యుత్ ఏర్పాట్ల కోసం కావాల్సిన మెన్, మెటీరియల్‌ను సమకూర్చుకొని నాణ్యమైన విద్యుత్ అందించి సంస్థకు పేరు తీసుకురావాలన్నారు. మహాజాతర పనులను పస్రా సబ్ స్టేషన్ నుంచి మొదలు.. నార్లాపూర్, కొత్తూరు, తాడ్వాయి, మేడారం న్యూ సబ్ స్టేషన్ మెయిన్ అమ్మవార్ల గద్దెల ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, జంపన్న వాగు పరిసరాలను పరిశీలించి అవసరమైన విద్యుత్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్ ) మధుసూదన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ మోహన్‌రావు, జీసీఎం రాజు చౌహాన్, ఎస్‌ఈ మల్చూర్‌నాయక్, డీఈ పులుసం నాగేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


