చెట్టు కూలి మీదపడి మరిపెడ వాసి మృతి
● చందుపట్ల
సమీపంలో ఘటన
మరిపెడ రూరల్: మోంథా తుపాన్ బీభత్సానికి చెట్టు కూలి మీదపడడంతో మరిపెడ వాసి మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతన మండలం చందుపట్ల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన కోట లక్ష్మీనారాయణ (50) 30 ఏళ్ల క్రితం బతుకు దెరువు నిమిత్తం మరిపెడ మండలం తానంచర్లకు వలస వచ్చి మెడికల్ షాపు నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం బైక్‌పై మద్దిరాలకు వెళ్లి తిరిగి తానంచర్లకు వస్తున్నాడు. మార్గ మధ్యలో చందుపట్ల సమీపంలో భారీ వర్షంతో కూడిన ఈదురు గాలులకు చెట్టు కూలి బైక్ పై పడడంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు.


