నాలుగేళ్లకే నూరేళ్లు
రేగొండ: నాలుగేళ్లకే చిన్నారికి నూరేళ్లు నిండాయి. కూలర్ వైరే యమపాశమైంది. అప్పటి వరకు ఆడుకున్న చిన్నారి అంతలోనే మృత్యు ఒడికి చేరుకోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రామన్నగూడెం తండాలో కరెంట్ షాక్‌తో చిన్నారి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన బానోత్ వీరు–ప్రియాంక దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉదయం పనినిమిత్తం వారు పరకాలకు వెళ్లారు. కాగా, ఇంటి వద్ద అమ్మమ్మ వద్ద ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కూలర్ వైరు తగలడంతో కుమార్తె అంజలి (4) షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి తండ్రి వీరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రెండు బైక్‌లు ఢీ..
దుగ్గొండి: రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని గిర్నిబావి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పీజీతండా గ్రామానికి చెందిన నునావత్ రాజేందర్(35) భార్య రజితతో కలిసి బైక్‌పై బుధవారం ఉదయం గురిజాలలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి స్వగ్రామం వస్తుండగా గిర్నిబావి సమీపంలోని వినాయక ఇండస్ట్రీస్ వద్ద అదే మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్న బాబు మిల్లులోకి వెళ్లడానికి బైక్ రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రాజేందర్ బైక్ బాబు వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రజిత, బాబుకు గాయాలయ్యాయి. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రావుల రణధీర్‌రెడ్డి తెలిపారు.
● కరెంట్ షాక్‌తో చిన్నారి మృతి
● రామన్నగూడెంలో విషాదఛాయలు
యువకుడి మృతి.. ఇద్దరికి గాయాలు
నాలుగేళ్లకే నూరేళ్లు


