దంతాలపల్లి : అప్పుల బాధతో ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం మండలకేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంట్లకు చెందిన గడ్డం ఉప్పలయ్య(48) బతుకుదెరువు నిమిత్తం సుమారు పదేళ్ల క్రితం దంతాలపల్లికి వలస వచ్చాడు. మండల కేంద్రంలో ఎలక్ట్రికల్, శానిటరీ షాపు నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలకు సుమారు రూ. 75 లక్షల వరకు ఫైనాన్స్‌లో అప్పు చేశాడు. అయితే కొంతకాలంగా షాపు సరిగా నడవకపోవడంతో అప్పు ఎలా తీర్చాలని మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కూతురు అంబిక, కుమారుడు శ్రీరామ్ ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు శ్రీరామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
నెల్లికుదురు : పని చేయాలని తల్లి మందలించిందనే కారణంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజర శివారు నంద్య తండాలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాసరావు కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ పవన్ కల్యాణ్ (21) గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేసేవాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం తన తండ్రి మృతిచెందినప్పటి నుంచి మనస్తాపం చెందుతున్నాడు. కొద్దిరోజులుగా పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో పనులకు వెళ్లాలని తల్లి కమిలి మందలించింది. దీనిపై మనస్తాపం చెందిన పవన్‌కల్యాణ్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి కమిలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
విషజ్వరంతో వివాహిత మృతి
బయ్యారం: విషజ్వరంతో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన సోమవారం మండలంలోని జగ్గుతండాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన చల్ల రమాదేవి(30)కి వారం రోజుల క్రితం జ్వరం రాగా కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం, హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందింది. మృతురాలికి భర్త మహేశ్, కుమారుడు ఉన్నారు.
గుండెపోటుతో భక్తుడు..
● సోమేశ్వరాలయంలో ఘటన
పాలకుర్తి టౌన్/పెద్దవంగర: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఆలయ అధికారులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం చిన్న వంగర గ్రామానికి చెందిన పాకనాటి సోమారెడ్డి(72) కుటుంబ సభ్యులతో కలిసి సోమేశ్వరాలయానికి వచ్చాడు. ఆలయ గర్భగుడిలో స్వామివారికి అభిషేకం చేశాడు. అనంతరం పక్కన ఉన్న లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని మహా మండపంలోకి రాగానే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే కుటుంబీలు, భక్తులు, ఆలయ అధికారులు, ఎస్సై వపన్‌కుమార్.. సోమారెడ్డికి సీపీఆర్ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కారులో ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సోమారెడ్డికి గతంలో గుండె ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ జరిగిందని కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, సోమారెడ్డి రైతుబంధు పెద్దవంగర మండల కన్వీనర్‌గా పని చేశాడు.
అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య
అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య
అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య


