విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● ఎమ్మెల్యే మురళీనాయక్
కేసముద్రం: అధికారులు, ఆయా శాఖల సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మురళీనాయక్ హెచ్చరించారు. కేసముద్రం, ఇనుగుర్తి మండల కేంద్రాల్లో వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు అధికారులు ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంటికన్నె గ్రామంలో ఇంకుడుగుంత నిర్మాణం పనులను ఏకపక్షంగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. మరోసారి ఇలా జరగొద్దని పీఆర్ ఏఈని హెచ్చరించారు. పీఆర్ శాఖ నుంకి మంజూరైన 10 రోడ్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వెనక్కి వెళ్లాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కొందరు కా ర్యదర్శులు వసూళ్లకు పాల్పడుతున్నారని, దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. అనంతరం పలువురికి కల్యా ణలక్ష్మి చెక్కులు అందజేశారు. అదేవిధంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా ధన్నసరి పీఏసీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మక్కల కొనుగోళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మహముద్‌పట్నంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. తమకు భోజనం సక్రమంగా పెట్టడంలేదని విద్యార్థినులు ఎమ్మెల్యే తెలి యజేయగా.. నిర్వాహకులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీలోని సమస్యలపై, ఇక్కడి టీచర్ల తీరుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆ యన కోరారు. అమీనాపురం భూనీలా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. కేసముద్రం మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి, తహసీల్దార్ తరంగిణి, ఎంపీడీఓలు క్రాంతి, పార్థసారథి, ము న్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, రావుల మురళి, వెంకన్న, దస్రూనా యక్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.


