బడిలో బురద!
ఆ పాఠశాలకు వెళ్లాలంటే ప్రధాన సెంటర్ నుంచి పాఠశాల గేటు వరకు ఉన్న రోడ్డు వెంట ఉన్న బురదలో నడవాల్సిందే.. ఇక పాఠశాల గేటు వద్ద నుంచి తరగతి గదుల వరకూ బురదే.. ప్రాంగణం మొత్తం ఏపుగా పెరిగిన గడ్డి.. ఇదీ గూడూరు మండల కేంద్రంలో 102 మంది బాలికలతో కొనసాగుతోన్న ప్రభుత్వ బాలికల హైస్కూల్ పరిస్థితి. చిన్నపాటి వర్షం కురిసినా దారంతా బురదమయంగా మారుతుండడంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యను పరిష్కరించేవారే లేరా.. అని విద్యార్థినులు ఆవేదనగా అడుగుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తీర్చాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
– గూడూరు
బడిలో బురద!


