మహిళా పీజీ కళాశాలలో రచ్చ | - | Sakshi
Sakshi News home page

మహిళా పీజీ కళాశాలలో రచ్చ

Oct 26 2025 8:29 AM | Updated on Oct 26 2025 8:29 AM

మహిళా పీజీ కళాశాలలో రచ్చ

మహిళా పీజీ కళాశాలలో రచ్చ

కంప్యూటర్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌

బాధ్యతలు తీసుకోని మధుశ్రీ

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బీఎస్‌ఎల్‌ సౌజన్యకు కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మధుశ్రీకి మధ్య కొంతకాలంగా నెలకొన్న వివాదం శనివారం తారస్థాయికి చేరింది. ప్రిన్సిపాల్‌ సౌజన్య తనపై దౌర్జన్యం, దాడి చేశారని మధుశ్రీ తాజాగా వీసీ, రిజిస్ట్రార్‌లకు ఫిర్యాదు చేసింది. సౌజన్య కూడా మధుశ్రీపై పలు ఆరోణలు చేస్తూ వారి దృష్టికి తీసుకెళ్లారు. వీరి వివాదాన్ని పరిష్కరించేందుకు రిజిస్ట్రార్‌ రామచంద్రం నలుగురు ప్రొఫెసర్లతో కూడిన విచారణ కమిటీని నియమించారు.

వివిధ ఖర్చుల బిల్లుల వ్యవహారం..

యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా సెప్టెంబర్‌లో గణిత విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సౌజన్య బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఏడాదిపాటు కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మధుశ్రీ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. మొదటినుంచి వీరిమధ్య సయోధ్య లేదు. మధుశ్రీ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కాలంలో అలుమ్ని సమావేశం పేరిట వసూలు చేసిన డబ్బులు, ఖర్చుల విషయంపై సౌజన్య ప్రశ్నించడం, వివిధ బిల్లుల విషయంలోనూ అడగటంతో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. అదేవిధంగా విద్యుత్‌శాఖ డిపార్ట్‌మెంటల్‌ పరంగా యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాలను పరీక్ష కేంద్రంగా వినియోగించుకున్నారని, ఇందుకు వారు రూ.20వేల వరకు ఇస్తారని, ఆ డబ్బులు దేనికి వినియోగించారని ఈనెల 24న ప్రిన్సిపాల్‌ సౌజన్య కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మధుశ్రీని అడిగినట్లు తెలిసింది. దీంతోపాటు పలు విషయాలపై ప్రిన్సిపాల్‌ అభ్యంతరాలు తెలుపుతుండడంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

విచారణ కమిటీ చైర్‌పర్సన్‌గా జ్యోతి..

వీరిద్దరి వివాదంపై ఈనెల 24న వీసీ ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ రామచంద్రం విచారణ కమిటీని నియమించారు. కమిటీ చైర్‌పర్సన్‌గా ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతి, సభ్యులుగా ప్రొఫెసర్లు మనోహర్‌, శ్రీలత, నర్సింహాచా రి, మెంబర్‌ కన్వీనర్‌గా శ్రీలతను నియమించారు. విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్‌ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ప్రిన్సిపాల్‌ సౌజన్య వర్సెస్‌ మధుశ్రీ

తనపై దాడి చేశారని మధుశ్రీ..

వీసీ, రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు

మధుశ్రీ హయాంలో

జరిగిన వ్యవహారాలను వీసీకి

వివరించిన సౌజన్య

నలుగురు ప్రొఫెసర్లతో

విచారణ కమిటీ నియామకం

మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని

ఉత్తర్వులు

మధుశ్రీకి కంప్యూటర్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తూ ఈనెల 24న ప్రిన్సిపాల్‌ సౌజన్య ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను తీసుకునేందుకు మధుశ్రీ నిరాకరించారు. ప్రిన్సిపాల్‌ స్వయంగా స్టాఫ్‌రూమ్‌కు వెళ్లి మధుశ్రీ బ్యాగ్‌పై ఆర్డర్‌ కాపీని పెట్టగా, తిరిగి ఆ కాపీని చుట్టి తనమీదకి విసిరిందని, దుర్బాషలాడిందని ప్రిన్సిపాల్‌ సౌజన్య అంటున్నారు. స్టాఫ్‌రూమ్‌నుంచి బయటికి వచ్చి గట్టిగా అరుస్తుండటంతో ప్రిన్సిపాల్‌ సౌజన్య అమెవద్దకు వెళ్లి ఎందుకు అరుస్తున్నావ్‌ లోనికి రావాలని మధుశ్రీ చేయి పట్టుకొని లాగగా, ఆమె చేయికి గాయమైనట్లు సమాచారం. ఇద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరడంతో మధుశ్రీ ఈనెల 24 వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా సౌజన్య కొద్దిరోజుల క్రితమే వీసీ ప్రతాప్‌రెడ్డిని కలిసి గతంలో మధుశ్రీ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన సమయంలో వివిధ బిల్లుల వ్యవహారాలను వీసీకి తెలియజేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement