బైబై టెక్నోజియాన్..
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్న వార్షిక సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్–25 వేడుకలు శనివా రం ముగిశాయి. రెండు రోజుల పాటు సీ రాకెట్, మిలిటరీ మ్యాన్ నమూనా, ఏరోప్లేన్, రోబోటిక్స్ క్లబ్ సర్వీంగ్ రోబో, నియాన్ క్రికెట్, పెడస్టల్ బ్రిడ్జి వంటి 40కి పైగా ఈవెంట్లతో టెక్నోజియాన్ అలరించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి సుమారు ఏడు వేల మంది విద్యార్థులు సాంకేతిక విజ్ఞానాన్ని పంచుకునే వేదికగా టెక్నోజియాన్–25 నిలిచింది. ఈ ఫెస్ట్‌లో వివిధ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు నిట్ టెక్నోజియాన్ టీం ఆన్‌లైన్‌లో రూ.2 లక్షల బహుమతులు ప్రదానం చేసింది. చివరి రోజువిద్యార్థులు ప్రదర్శించిన పలు ఈవెంట్లు ఆకట్టుకున్నాయి.
ప్రణాళికతోనే విజయం..
ప్రణాళిక విద్యనభ్యసిస్తేనే విజయం సాధ్యమని సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత తెలిపారు. నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న రెండురోజుల టెక్నోజియాన్–25 వేడుకల్లో భాగంగా శనివారం నిట్ అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఎక్స్‌పర్ట్ టాక్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్ సాధించడానికి తీసుకోవాల్సిన అంశాలపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. సివిల్స్ సాధనకు ప్రత్యేక సమయం కేటాయించండంతో పాటు ప్రతీ రోజు అధ్యయనం చేసి అంశాలపై పరీక్ష రాయడం, గతంలో సివిల్స్‌లో వచ్చిన ప్రశ్నలను చ దవడం, రాయడం ద్వారా చదువుకున్న అంశాలపై పట్టు సాధించొచ్చన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సత్తాచాటుతున్న నిట్ విద్యార్థులు సివిల్స్‌పై దృష్టి సారించాలన్నారు.
నిట్‌లో ముగిసిన సాంకేతిక
మహోత్సవ వేడుకలు
విజేతలకు ఆన్‌లైన్‌లో
రూ.2 లక్షల బహుమతుల ప్రదానం


