దొంగ అరెస్ట్
పర్వతగిరి: పెట్రోల్ బంకులు, మినీ బ్యాంకులను టార్గెట్ చేసిన దొంగను పర్వతగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఎస్సై బోగం ప్రవీణ్ నిందితుడి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా రెడ్యానాయక్ కాలనీకి చెందిన రాపోలు శ్రీనివాస్ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలోని పెట్రోల్ బంకులు, మినీ బ్యాంకులను టార్గెట్ చేశాడు. తన క్రెడిట్‌కార్డు బిల్లు పెండింగ్‌లో ఉందని, వెంటనే కడితే తిరిగి మీ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తానని నమ్మించి రూ.50వేలనుంచి రూ.2లక్షల వరకు వసూలు చేసి తిరిగి డబ్బులు ఇవ్వకుండా పారిపోయేవాడు. ఇలా పర్వతగిరి, నెక్కొండ, వర్ధన్నపేట, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల్లోని పెట్రోల్ బంకులు, మినీ ఏటీఎంలలో దాదాపు రూ.6లక్షల వరకు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాలన్నీ ఒప్పుకోగా అతడి నుంచి రూ.3లక్షల నగదు, ఆరు గ్రాముల బంగారం, బ్లూ కలర్ యాక్టీవా స్కూటీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. శ్రీనివాస్‌ను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పర్వతగిరి ఎస్సై బోగం ప్రవీణ్, సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రైవేట్ స్కూల్ బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం, నర్సింగ్‌రావుపల్లికి చెందిన బండారి వినోద్ (22) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తుండేవాడు. ఓ హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు తీసేందుకు టీఎస్27ఎఫ్ 3270 స్కూటీపై బొంగ్లూర్ నుంచి ఔటర్ సర్వీస్ రోడ్డు మీదుగా తుక్కుగూడకు వెళ్తున్నాడు. రావిర్యాల శివారులోని కళాంజలి సమీపంలో ఇండస్‌వాలీ స్కూల్ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. బైక్ పైనుంచి కింద పడిన వినోద్‌ను రోడ్డుపై కొద్దిదూరం లాక్కెళ్లింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఈసమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేరు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.
దొంగ అరెస్ట్


