బైక్‌ను ఢీకొన్న లారీ..
● యువకుడి దుర్మరణం
● మైలారంలో ఘటన
రాయపర్తి: బైక్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మండలంలోని మైలారంలో చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పెర్కవేడుకు చెందిన అంగిరేకుల శివ(26) బైక్‌పై మైలారం నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో మైలారంలో ఓ లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, శివ మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
బైక్‌ను ఢీకొన్న లారీ..


