జస్టిస్ గవాయ్ దళితుడైనందునే ఈ వివక్ష..
హన్మకొండ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవా య్‌పై దాడికి యత్నం జరిగితే ఇప్పటి వరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. శనివారం హనుమకొండలోని హోట ల్ హరిత కాకతీయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో కేసులను సుమోటోగా స్వీకరిస్తున్న వ్యవస్థలు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడి యత్నం ఘటనలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఘ టన జరిగి 19 రోజులైనా ఇంకా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కేవలం దళితుడు అయినందు నే కేసు నమోదు చేయడం లేదన్నారు. ఈ స్థానంలో ఇతరులుంటే ఎప్పుడో కేసు నమోదు చేసే వారన్నా రు. ఢిల్లీ పోలీసులు,జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసును స్వీకరించలేదన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఓ రౌడీషీటర్ ఎన్‌కౌంటర్‌లో చనిపోతే తెలంగాణ మానవ హక్కు ల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. ఇలా అనేక సందర్భాల్లో సుమోటో కేసులు నమోదైన అంశాలను వివరించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్, జిల్లా ఇన్‌చార్జ్ సోమన్న, నాయకులు శ్రీనివాస్, వెంకటస్వామి, శివ, నారా యణ, మంద వర్ధన్ , రాజేశ్, అనిల్ పాల్గొన్నారు.
ఆయనపై దాడికి యత్నం జరిగితే కేసు ఎందుకు నమోదు చేయలేదు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ


