ఓవరాల్ చాంపియన్ కేడీసీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రీడాపోటీల్లో హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల అంతర్ కళాశాలల పురుషుల రెండో దఫా క్రీడాపోటీలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి రిజిస్ట్రార్ వి. రామచంద్రం, స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం రామచంద్రం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లోనూ రాణించాలన్నారు.
వివిధ క్రీడల్లో విజేతలు వీరే..
ఐదు విభాగాల్లో క్రీడాపోటీలు జరిగాయి. ఇందులో ఖోఖోలో కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ మొదటి బహుమతి, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ద్వితీయ బహుమతి, బాల్‌బ్యాడ్మింటన్‌లో బొల్లికుంట వీసీపీఈ మొదటి బహుమతి, మణుగూరులోని టీజీటీఆర్‌డీసీ రెండో బహుమతి, హ్యాండ్‌బాల్‌లో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రథమ బహుమతి, ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ ద్వితీయ బహుమతి, సాఫ్ట్‌బాల్‌లో హనుమకొండలోని యూ ఏఎస్‌సీ కాలేజీ ప్రథమ బహుమతి, మంచిర్యాలలోని ఎంఐఎంఎస్ కళాశాల రెండో బహుమతి సాధించింది. క్రాస్‌కంట్రీ పోటీల్లో హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీకాలేజీ ప్రథమ బహుమతి, ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ ద్వితీ య బహుమతి సాధించింది. ఓవరాల్ చాంపియన్‌గా హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిలిచింది. కార్యక్రమంలోయూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమారస్వామి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జె. సోమన్న, సెక్రటరీ సునీల్‌రెడ్డి, డాక్టర్ ఆశీర్వాదం, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
ముగిసిన అంతర్ కళాశాలల క్రీడాపోటీలు
బహుమతులు ప్రదానం చేసిన రిజిస్ట్రార్


