ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థల పరిశీలన
హన్మకొండ: ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై టీజీ ఎన్పీడీసీఎల్ దృష్టి సారించింది. ఈ మేరకు అధికారులు అనువైన స్థలాల గుర్తింపు కోసం సర్వే చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 80కి తగ్గకుండా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ మేరకు రెండు రోజులుగా స్థల పరిశీలన చేస్తున్నారు. శనివారం టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబ రెడ్డి, ఏడీఈ పి.మల్లికార్జున్, ఏఈ మధులిక, లైన్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ రాజు, లైన్‌మెన్ సతీశ్ సర్వే చేశారు. ఇప్పటి వరకు 46 స్థలాలను గుర్తించారు. ఇందులో ప్రభుత్వ స్థలాలు 19, పబ్లిక్ రంగ సంస్థలు 6, ప్రైవేట్ స్థలాలు 21 గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికిల్ ఎన్‌హాన్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు రాయితీ అందిస్తుంది.
హనుమకొండ జిల్లాలో
80కి తగ్గకుండా ఏర్పాటు
టీజీ ఎన్పీడీసీఎల్ అధికారుల సర్వే


