
మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు సహకరించొద్దు, హింసామార్గం విడిచి సాధారణ ప్రజా జీవితంలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ యువజన సంఘం పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా సోమవారం వాల్‌పోస్టర్లు వెలిశాయి. మండల పరిధిలోని బయ్యక్కపేట, ఊరట్టం, కాల్వపల్లి గ్రామాల్లో పలుచోట్ల వాల్ పోస్టర్లు కనిపించాయి. మావోయిస్టులతో ఒరిగేదేమి లేదని అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో మావోయిస్టుల అవసరం లేదని.. గ్రామాల అభివృద్ధికి, పిల్లల భవిష్యత్ బాగుండాలంటే మావోయిస్టుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ వాల్ పోస్టర్ల విషయం ఆయా గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.