
యూరియా ఏదయా!
మహబూబాబాద్ రూరల్/కేసముద్రం: యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. పంటలకు యూరియా పంపిణీ చేయాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యాప్తంగా రైతులు రాస్తారోకో, ధర్నా చేశారు. దీంతో వాహనాలు స్తంభించాయి. జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద తెల్లవారుజామున చేరుకున్న రైతులకు సొసైటీ సిబ్బంది యూరియా సా్‌ట్క్ లేదని చెప్పడంతో తొర్రూరు ప్రధాన రహదారిపై ఉదయం 10.30 గంటలకు రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండుటెండలోనే రైతులు ఐదు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. పలువు రు రైతులు రోడ్డుపైనే పడుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఏడీఏ అజ్మీర శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. యూరియా గ్రామాల వారీగా పంపిణీ చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలపడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
గందరగోళంగా టోకెన్ల పంపిణీ
యూరియా టోకెన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. సోమవారం కేసముద్రం ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలోని రైతువేదిక వద్ద యూరియా టోకెన్లు ఇచ్చేందుకు ఆదివారం సాయంత్రం బారీకేడ్లు ఏర్పాటు చేయగా, సుమారు వెయ్యి మంది రైతులు రాత్రి నుంచే క్యూలో ఉన్నారు. సోమవారం ఉదయం వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రైతులు చేరుకోవడంతో పరిస్థితి ఉ ద్రిక్తంగా మారింది. రైతుల మధ్య తోపుబాట జరగడంతో పలువురు కిందపడ్డారు. గోప్యాతండాకు చెందిన బానోత్ అనిత అనే మహిళా రైతు కాలికి తీవ్రగాయం కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ముందస్తు జాగ్రత్తగా అధికారులు 860 టోకెన్‌లకు గాను 430 పంపిణీ చేసి నిలిపేశారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు పోలీస్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న త హసీల్దార్ వివేక్, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. యూరియా అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మరిపెడ మండలంలో రైతు లు రాస్తారోకో చేయడంతో సుమారు రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఐదు గంటల పాటు
రైతుల రాస్తారోకో
కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
కేసముద్రంలో తోపులాట,
మహిళా రైతుకు గాయాలు

యూరియా ఏదయా!

యూరియా ఏదయా!

యూరియా ఏదయా!