● నేడు హాస్టల్ భవనాలను
ప్రారంభించనున్న మంత్రులు
నెహ్రూసెంటర్: వైద్య కళాశాల హాస్టల్ భవనాలు పూర్తి కాకపోక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో ‘సాక్షి’లో ‘మెడికోల సతమతం’ అనే కథనం ఆగస్టు 29వ తేదీన ప్రచురితమైన విషయం విదితమే. దీంతో స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరగా పనులు చేపట్టి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశా రు. సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాలను ఎమ్మె ల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ పరిశీలించారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. నేడు కళాశాల భవనాల ప్రారంభానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రులు పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారని తెలిపా రు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ లకావత్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్డీఓ కృష్ణవేణి, నాయకులు ఎడ్ల రమేశ్, ఎండీ ఖలీల్, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, పద్మం ప్రవీణ్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్ భవనాలను పరిశీలించిన
కలెక్టర్, ఎస్పీ..
ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాల హాస్టల్ భవనాల ప్రారంభానికి మంత్రులు హాజరవుతున్నందున కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్, అదనపు కలెక్టర్ కె.అనిల్‌కుమార్, ఆర్డీఓ కృష్ణవేణి పరిశీలించారు.
తప్పనున్న మెడికోల ఇబ్బందులు
తప్పనున్న మెడికోల ఇబ్బందులు