
ఆలకించరూ..
అందుబాటులోకి 24గంటల వైద్యం
మంత్రిగారూ..
సాక్షి, మహబూబాబాద్: గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న జిల్లా.. గ్రామీణ ప్రాంతం జనాభా తోపాటు నిరుపేద కుటుంబాలు ఎక్కువ.. ఇక్కడ ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంచాలని అందరూ చేబుతుంటారు.. ఈ దశలోనే గత ప్రభుత్వం పలు ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయడం, మరికొన్ని చోట్ల కొత్త ఆస్పత్రులను మంజూరు చేసి.. శిలాఫలకాలు కూడా వేశారు. కానీ రెండు సంవత్సరాలు అవుతున్నా.. పనులు ముందుకు సాగడం లేవు. పేదలకు చేరువలో వైద్యం అందడంలేదు.. ఇలా గత ప్రభుత్వం వేసిన శిలాఫలకాలకే పరిమితమైన పనులను ముందుకు తీసుకెళ్లి గిరిజన జిల్లాలో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, నిధులు మంజూరు చేయాలని నేడు (మంగళవారం) జిల్లాకు వస్తున్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను జిల్లా ప్రజలు కోరుతున్నారు.
వెక్కిరిస్తున్న శిలాఫలకాలు
జిల్లా కేంద్రం తర్వాత పెద్ద పట్టణం, డివిజన్ కేంద్రం తొర్రూరు. గిరిజనులు ఎక్కువగా ఉన్న పట్టణం మరిపెడ. ఈ రెండు చోట్ల ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ప్రతీరోజు వందలాది మంది రోగులు వస్తుంటారు. రోగుల ఫ్లోటింగ్, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రెండు ఆస్పత్రులను 100 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మార్చేందుకు గత ప్రభుత్వం అంగీకరించింది. ఒక్కొక్క ఆస్పత్రికి రూ. 36 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2023 సెప్టెంబర్ 28న అప్పటి వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా ఆస్పత్రుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తొర్రూరుకు వైద్యులు, స్టాఫ్ నర్సులను కూడా నియమించారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ కాలేదని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా జిల్లాలోని నర్సింహులపేట, పెద్దవంగర, సీరోలు మండలా ల్లో నూతన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మంజూరు చేశారు. ఇందుకోసం ఒక్కొక్క పీహెచ్‌సీకి రూ. 1.43 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇందులో సీరోలు మండలం కాంపెల్లి, న ర్సింహులపేట మండలంలో పీహెచ్‌సీ నిర్మాణాల కు టెండర్ ప్రక్రియ పూర్తి కాగా పనులు ప్రారంభించలేదు. అలాగే పెద్దవంగర పీహెచ్‌సీ నిర్మాణం పనులు భూసేకరణతోనే ఆగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది సెస్టెంబర్‌లో కేసముద్రం మున్సిపాలిటీ, కొత్తగూడలోని ఆస్పత్రులను 30 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ కొత్తగూడ రూ. 13.5 కోట్లు, కేసముద్రానికి రూ.12 కోట్లు మంజూరు చేసింది. కానీ ఇంత వరకు పనులు ప్రారంభించలేదు.
వెక్కిరిస్తున్న శిలాఫలకాలు
రెండేళ్లు గడిచినా..
అప్‌గ్రేడ్ కాని పీహెచ్‌సీలు
ఇబ్బందుల్లో గిరిజనులు
నేడు జిల్లాకు
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాక
గిరిజన లంబాడీలు, ఆదివాసీ గిరిజనులతోపాటు మారుమూల ప్రాంతాల్లో నివసించే వారే జిల్లాలో ఎక్కువ. వీరికి తరచుగా వ్యాధులు సోకడం, చిన్న వైద్యానికే దూర ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వారి సంపాదనలో ఎక్కువ శాతం వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారు. కొందరు అప్పుల పాలవుతున్నారు. అయితే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం జనరల్ ఆస్పత్రితోపాటు, గూడూరు, గార్ల సీహెచ్‌సీలు, 21 పీహెచ్‌సీల వైద్యం మెరుగు పర్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం మంజూరు చేసిన తొర్రూరు, మరిపెడ సీహెచ్‌సీలతో జనరల్ ఫిజీషియన్లు, జనరల్ సర్జన్లు, ప్రత్యేక నిపుణులు, స్టాఫ్ నర్సులు, పేషెంట్ కేర్స్, శానిటేషన్ సిబ్బంది.. ఇలా ఒక్కొక్క ఆస్పత్రికి 120 మంది మేరకు వైద్యులు, సిబ్బంది వస్తారు. 24 గంటల ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంటుంది. తొర్రూరు 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తే డివిజన్‌లోని ఏడు మండలాలతోపాటు, జనగామ, వరంగల్ జిల్లాల ప్రజలకు మేలు జరుగుతుంది. మరిపెడ ఆస్పత్రి అప్‌గ్రేడ్ ద్వారా మరిపెడ, సీరోలు, నర్సింహులపేట, చిన్న గూడూరు మండలాలతోపాటు, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల ప్రజలకు మేలు కలుగుతుంది. నర్సింహులపేట, కాంపెల్లి, పెద్దవంగరలో పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తే ఆయా మండలాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండదు.

ఆలకించరూ..