
ఓపీఎస్‌ను అమలు చేయాలి
● తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ
జిల్లా చైర్మన్ శ్రీనివాస్
మహబూబాబాద్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ వడ్డెబోయిన శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ రఫీ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు సామ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సీపీఎస్ పెనుశాపంగా మారిందన్నారు. పోరాట ఫలితంగా కేంద్రం సీపీఎస్‌ను యూపీఎస్‌గా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి వెంటనే పీఆర్సీని అమలు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, యాఖుబ్, రమేశ్, వీరయ్య, ఎం.నాగయ్య, ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.