
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
● ప్రజావాణిలో 133 వినతులు
మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా లెనిన్‌వత్సల్ టొప్పో మాట్లాడుతూ పెండింగ్ వినతులను వెంటనే పరి ష్కరించాలని, పరిష్కరించలేని దరఖాస్తులు కార ణం చూపుతూ బాధితులకు తెలియజేయాలన్నా రు. ప్రజావాణి వినతులపై నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించే ది లేదన్నారు.గ్రీవెన్స్‌లో మొత్తం 133 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.