
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబాబాద్: భారీవర్షాల నేపద్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్తి ప్రాణ నష్టం జరుగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె అనిల్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.