
మహిళా దొంగ అరెస్ట్
వరంగల్ క్రైం: రద్దీ సమయంలో బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాలి బ్యాగు నుంచి డబ్బులు అపహరించిన మహిళా దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. ములుగు జిల్లా గొల్లవాడ గ్రామానికి చెందిన ప్రమీళ సోమవారం హైదరాబాద్ వెళ్లడానికి హనుమకొండ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతోంది. ఈ క్రమంలో ఆమె బ్యాగు నుంచి ఓ మహిళా దొంగ రూ.75 వేలు అపహరించింది. దీంతో ప్రమీళ కేకలు వేయగా అక్కడే విధుల్లో ఉన్న హనుమకొండ ఎస్సై కిశోర్ అప్రమత్తమై బస్టాండ్‌లో తనిఖీ చేశారు. ఈ సమయంలో ఓ మహిళ.. పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. ఆమె బ్యాగు తనిఖీ చేయగా అందులో అపహరించిన రూ. 75 వేలు లభించాయి. సదరు మహిళా దొంగను మహారాష్ట్రలో నాగ్‌పూర్‌కు చెందిన సరిఫ బాయి సురేశ్ మంకార్‌గా గుర్తించారు. అనంతరం ప్రమీళ ఫిర్యాదు మేరకు ఎస్సై కిశోర్ కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ శివకుమార్ తెలిపారు.