
రూ. 5లక్షల విలువైన గంజాయి పట్టివేత
తరిగొప్పుల: జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి క్రాస్ వద్ద రూ. 5లక్షల విలువైన 10కిలోల గంజాయిని పట్టకున్నట్లు సీఐ అబ్బయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం తరిగొప్పుల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై శ్రీదేవి సిబ్బందితో కలిసి అక్కరాజుపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాలోని గంజాం జిల్లా సూర్య నాగ గౌరీ శంకర్ రోడ్డుకు చెందిన సంతోష్ పాండా, పున్నాత్ గ్రామానికి చెందిన శివరాం డాక్వా ఆటోలో అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో ఆటోను ఆపి తనిఖీ చేయగా రూ.5 లక్షల విలువైన 10 కిలోల గంజాయి లభించింది. కాగా, శివరాం డాక్వా పోలీసులను చూసి పారిపోగా సంతోష్ పాండాను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు చేసినట్లు సీఐ అబ్బయ్య తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై కాసర్ల రాజయ్య,సిబ్బంది పాల్గొన్నారు.
ఒకరి అరెస్ట్, రిమాండ్.. మరొకరి పరారీ
వివరాలు వెల్లడించిన పోలీసులు