
వైద్యులు అందుబాటులో ఉండాలి
మహబూబాబాద్: వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఉమ్మడి వరంగల్ జిల్లా సీజనల్ వ్యాధుల ప్రత్యేకాధికారి వాసం వెంకటేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం జిల్లా వైద్యాధికారి, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు, ప్రోగ్రాం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అధికారురలు అప్రమత్తంగా ఉండాలని, మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతీ గ్రామంలో శానిటేషన్ సజావుగా జరగాలన్నారు. పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులకు ఫీవర్ సర్వే నిర్వహించి, అవసరమైన వారికి పరీక్షలు చేయాలన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, డీపీఓ హరిప్రసాద్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ ఉన్నారు.
పరిసరాల పరిశుభ్రత పాటించాలి..
నెహ్రూసెంటర్: ప్రభుత్వ ఆస్పత్రి పరిసరాలు ని త్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వార్డులు, ఫార్మసీతో పాటు ఐసీటీసీ సెంటర్‌ను మంగళవారం సందర్శించారు. ఐసీటీసీ సెంటర్‌లో నెలవారి పాజిటివ్ కేసులను రికార్డు చేయాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్‌ఎంఓ జగదీశ్వర్ ఉన్నారు.
వైద్యశిబిరాలు నిర్వహించాలి
బయ్యారం: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో వైద్యశిబిరాలు నిర్వహించాలని అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బయ్యారం పీహెచ్‌సీని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పీహెచ్‌సీలో పేషెంట్లతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్‌సీ పరిధిలోని జాఫ్రబాద్‌లో డెంగీ బారిన పడి చికిత్స పొందిన వారితో మాట్లాడి ప్రభుత్వ వైద్యం అందిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ ఉన్నారు.
రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ
ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి