● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
కురవి: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. తరగతి గదులను పరిశీలించారు. పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో పాఠ్యపుస్తకాలు చదివి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి, వారిని తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. నాణ్యమైన భోజనం అందజేయాలని ఆదేశించారు. అలాగే ఎస్సీ బాలికల వసతిగృహాన్ని సందర్శించారు. ఆయన వెంట తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ వీరబాబు, హెచ్‌ఎం ఎండీ వాహిద్, ఉపాధ్యాయులు ఉన్నారు.
విద్యుత్ ప్రమాదాలపై
జాగ్రత్తగా ఉండాలి
గూడూరు: విద్యుత్ సిబ్బంది, రైతులు, వినియోగదారులు విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాని ఆశాఖ మహబూబాబాద్ ఎస్‌ఈ విజేందర్‌రెడ్డి, డీఈ విజయ్ అన్నారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో మంగళవారం కొత్తగా ఏర్పాటు చేసిన మట్టెవాడ బ్రేకర్‌ను ఆన్ చేశారు. అనంతరం కేష్యతండాలో పొలంబాట నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు పంపుసెట్లు, స్టార్టర్లను ఎర్త్ చేయాలన్నారు. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ ఉపకరణాలు వినియోగించేటప్పుడు తడి చేతులతో తాకొద్దనన్నారు. అనంతరం సబ్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ సిబ్బందికి భద్రతా సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఈ ప్రణీత్, ఏడీఈ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.
వరినాట్లు వేసేటప్పుడు
జాగ్రత్తలు పాటించాలి
మహబూబాబాద్ రూరల్: వరి నాట్లు వేసేటప్పుడు చదరపు మీటరు పరిధిలో 33 కుదుర్లు ఉండేలా చూసుకోవాలని, అధిక పిలకలు వచ్చి ఎక్కువ దిగుబడి సాధించవచ్చని డీఏఓ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు చెరువుకొమ్ము తండాలో రైతులకు నారుమడి, నాటు వేసే విధానాలపై మంగళవారం క్షేత్రస్థాయిలో సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని, క్షేత్రస్థాయిలో పరిశీలించి నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నాటు వేసే విధానంపై రైతులకు వివరించామని తెలిపారు. నారు పోసిన 20 నుంచి 25 రోజుల తర్వాత నాటు వేసుకోవడం వల్ల అధిక పిలకలు వస్తాయని సూచించారు. రైతులు ఆగస్టు 15 లోపు వరి నాట్లను పూర్తిచేయాలని సూచించారు. అనంతరం మహిళా కూలీలతో కలిసి ఆయన వరినాటు వేశారు. కార్యక్రమంలో ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, టెక్నికల్ ఏఓలు రాజు, మోహన్, ఏఈఓ సాయిప్రకాశ్, రైతులు బద్రు, వీరు, రాము తదితరులు పాల్గొన్నారు.
‘కుల్పా’ అధ్యక్షుడిగా
నాగేశ్వర్‌రావు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (కుల్పా) అధ్యక్షుడిగా ఎ. నాగేశ్వర్‌రావును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకతీయ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన కుల్పా సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్నారు. గ్రంథపాలకుల దినో త్సవం సందర్భంగా ఆగస్టు 12న లైబ్రరీ సైన్స్‌లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థికి బంగారు పత కం, ఉత్తమ లైబ్రేరియన్ పురస్కారం, ఉత్తమ విద్యార్థికి మెమెంటో అందించాలని సమావేశంలో తీర్మానించినట్లు కుల్పా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణమాచార్య తెలిపారు.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచాలి