బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025

Jul 30 2025 7:16 AM | Updated on Jul 30 2025 7:18 AM

బేస్‌లైన్‌ టెస్టులో విద్యార్థుల మెరుగైన ఫలితాలు

ఇటీవల విడుదల చేసిన జిల్లా విద్యాశాఖ

గణిత చతుర్విద ప్రక్రియలో కనీస సామర్థ్యాలు

విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా బోధన

సాక్షి, మహబూబాబాద్‌: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా బోధించినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈమేరకు ఉపాధ్యాయులు తమ బోధన తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. కాగా జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రారంభ పరీక్షలు(బేస్‌లైన్‌ టెస్ట్‌) నిర్వహించారు. ఈ ఫలితాల ఆధారంగా బోధించాల్సి ఉంటుంది. కాగా ఉపాధ్యాయులు పిల్లల్లో ఏమేరకు పఠనాసక్తి పెంచారనే విషయంపై తిరిగి మూడు నెలల తర్వాత మరోసారి పరీక్షిస్తారు. ఆ ఫలితాల ఆధారంగా బోధనలో మార్పులు, చేర్పులు చేస్తారు. అలాగే విద్యా సంవత్సరం చివరలో తిరిగి పరీక్షలు నిర్వహించి ప్రారంభ, అంతిమ పరిణతిని లెక్కించి సాధించిన ఫలితాలు నమోదు చేస్తారు.

ప్రాథమిక స్థాయిలో..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో వచ్చిన తేడాను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈమేరకు రెండో తరగతి నుంచి నాల్గో తరగతి వరకు ప్రారంభ అభ్యసన సామర్థ్యాలు( ఎఫ్‌ఎల్‌ఎన్‌), 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు లర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం(ఎల్‌ఐపీ) పరీక్షలు పాఠశాలల ప్రారంభంలో నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పిల్లల్లో తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో పరిజ్ఞానం, ధారాళ పఠనం, చదివి అర్థం చేసుకోవడం, పూర్వ అభ్యసన భావన, అభ్యసనా ఫలితాలు మొదలైన అంశాలను తెలుసుకున్నారు. అదే విధంగా గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగాహారం మొదలైన చతుర్విద ప్రక్రియల స్థాయిపై పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఎల్‌పీఎస్‌ పరీక్షల్లో విద్యార్థులు స్థాయికి అనుగుణంగా సైన్స్‌, సోషల్‌ చదవడమే కాకుండా చదివిన విషయాలను ఏమేరకు అర్థం చేసుకుంటున్నారో తెలుసుకుంటున్నారు.

ఫలితాల ఆధారంగా బోధన..

పాఠశాలల పునఃప్రారంభంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా బోధన జరి పేందుకు విద్యాశాఖ మార్పులు, చేర్పులు చేస్తోంది. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే చదువులో ముందున్న విద్యార్థులను మరింత ప్రోత్సహిస్తూ బోధన సాగాలన్నదే ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు. మూడు నెలలకు మరోసారి పరీక్షలు నిర్వహించి వచ్చిన మార్పుతో సరిచూసి.. చివర మరోసారి పరీక్షిస్తారు. ఇలా పిల్లవాడు పాఠశాలలో చేరిన నాటి చదువు సామర్థ్యం, తర్వాత సాధించిన లక్ష్యా ల ఆధారంగా ఉపాధ్యాయుల బోధన పరిణతిని అంచనా వేస్తారు. వచ్చిన మార్పులు, నూతన ఆవిష్కరణలు, డిజిటల్‌ పద్ధతులను ఉపయోగించి బోధన జరపాలి.

విద్యార్థి సామర్థ్యం తెలుసుకొని బోధన

విద్యార్థుల అభ్యసన సామర్థ్యం తెలిసినప్పుడే అందుకు అనుగుణంగా బోధించాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. వీటిని తెలుసుకునేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఎల్‌ఐపీ పరీక్షలు నిర్వహించాం. వీటి ఫలితాల ఆధారంగా బోధనలో మార్పులు, చేర్పులు చేస్తున్నాం. ఉపాధ్యాయుల పనితనం.. విద్యార్థిలో వచ్చిన మార్పులు కూడా తెలుస్తాయి.

– రవీందర్‌ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి

న్యూస్‌రీల్‌

ఎఫ్‌ఎల్‌ఎన్‌ పరీక్షల ఫలితాలు (పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య 15,377)

భాష ధారాళపఠనం అర్థం చేసుకోవడం రాయడం

తెలుగు 8,924 5,708 3,225

ఇంగ్లిష్‌ 8,969 4,729 3,191

గణిత సామర్థ్యాలు

కూడికలు : 11549

తీసివేతలు : 7,926

గుణకారం : 4,184

భాగాహారం : 1,774

ఎల్‌ఐపీ పరీక్ష ఫలితాలు (పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య10,037)

భాష ధారాళపఠనం అర్థం చేసుకోవడం రాయడం మాట్లాడటం

తెలుగు 6,096 6,278 3,129 10,037

ఇంగ్లిష్‌ 5,510 4,898 2,969 4,854

హిందీ 4,342 4,110 2,150 4,558

గణిత సామర్థ్యాలు

కూడికలు : 8,788

తీసివేతలు : 6,879

గుణకారం : 5,098

భాగాహారం : 3,970

బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 20251
1/2

బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025

బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 20252
2/2

బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement